మహోన్నత వ్యక్తి సేవాలాల్ మహరాజ్ : ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
గిరిజనులు, ఆదివాసులకు రక్షణ కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్
దిశ, వైరా: గిరిజనులు, ఆదివాసులకు రక్షణ కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆధ్యాత్మిక, సంఘ సేవకుడని కొనియాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
ఆయన జీవితాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, మార్కెట్ చైర్మన్ బీడికే రత్నం, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, మండలాధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు పసుపులేటి మోహన్ రావు, డాక్టర్ కోటయ్య, వనమా విశ్వేశ్వరరావు, మోటపోతుల సురేష్, పట్టణాధ్యక్షుడు మద్దెల రవి, వైరా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అప్పం సురేష్, షేక్ బీబా సాహెబ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వేల్పుల మురళి, మండల ప్రధాన కార్యదర్శి అమరనేని మాధవరావు, పట్టణ నాయకులు ఎదునూరి శ్రీను, కర్నాటి హనుమంతరావు మరికంటి సేవ, మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సైదా, సర్పంచ్ లు సాధం రామారావు, భట్టా పెద్ద భద్రయ్య, తాటిపూడి ఉప సర్పంచి మన్నెం సత్యానంద్, దాసరి శ్రీను, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు