DMHO : ఉద్యోగాలు ఇచ్చింది గొడవలు పెట్టుకోడానికా

ఉద్యోగాలు ఇచ్చింది గొడవలు పెట్టుకోడానికి కాదని, వైద్య శాఖలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి (District Medical Officer)భాస్కర్ నాయక్ ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్పీ, ఆశ వర్కర్లకు సూచించారు.

Update: 2024-11-01 14:14 GMT

దిశ,మణుగూరు : ఉద్యోగాలు ఇచ్చింది గొడవలు పెట్టుకోడానికి కాదని, వైద్య శాఖలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి (District Medical Officer)భాస్కర్ నాయక్ ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్పీ, ఆశ వర్కర్లకు సూచించారు. శుక్రవారం ఆయన మణుగూరు మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని శివలింగాపురంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.

    అనంతరం రికార్డ్స్ ను తనిఖీ చేశారు. ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్పీ, ఆశ వర్కర్లతో (ANMs,MLHP,ASHA workers)సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిబద్దతో పని చేయాలన్నారు. కేటాయించిన సబ్ సెంటర్స్ ను ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు తెరిచే ఉంచాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమయానికి మందులు అందించాలన్నారు. కొందరు సిబ్బంది పీహెచ్సీలో గొడవలు పెట్టుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. మీకు ఉదోగ్యాలు ఇచ్చింది గొడవలు పెట్టుకోవడానికా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఓ బాలాజీ నాయక్, ఎన్సీడీ మధు, డాక్టర్ నిశాంత్ రావు, హెయో గొంది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Tags:    

Similar News