దిశ ఎఫెక్ట్... రేపు గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో విచారణ

వైరా మండలంలోని గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో చిన్న మొత్తాల పొదుపు నగదు స్వాహా వ్యవహారంపై సోమవారం ఎట్టకేలకు విచారణ నిర్వహించనున్నారు.

Update: 2024-08-18 15:41 GMT

దిశ, వైరా : వైరా మండలంలోని గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో చిన్న మొత్తాల పొదుపు నగదు స్వాహా వ్యవహారంపై సోమవారం ఎట్టకేలకు విచారణ నిర్వహించనున్నారు. ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మెన్ కు బదులుగా మరో ప్రైవేటు వ్యక్తి సంవత్సర కాలంగా విధులు నిర్వహించి ఖాతాదారుల నగదు లక్షలాది రూపాయలను కాజేశారనే ఆరోపణ బలంగా ఉన్నాయి. ఈ విషయమై దిశ వెబ్ సైట్ లో ఈనెల 16వ తేదీన గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో భారీ కుంభకోణం.... రూ. 10 లక్షలకు శఠగోపం, ఆదివారం రాత్రి 7:15 నిమిషాలకు మిస్సయిన 100 పాసుపుస్తకాలు ఎక్కడ...?

    అనే వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన తపాలా శాఖ ఉన్నతాధికారులు సోమవారం ఉదయం 9 గంటలకు గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ లో విచారణ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి గ్రామపంచాయతీ ట్రాక్టర్ కు మైకు పెట్టి గొల్లపూడి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి..పోస్ట్ ఆఫీస్ నందు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ సోమవారం గొల్లపూడి పోస్టాఫీసు నందు మీ పాస్​ పుస్తకాలు అన్నీ చెక్ చేయించుకోగలరు అంటూ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. వాస్తవానికి గత రెండు రోజుల క్రితమే గ్రామంలో టమకా వేయించాలని నిర్ణయించారు.

     అయితే గత రెండు రోజులుగా ఆ నిర్ణయం అమలు చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దిశ వెబ్సైట్లో ఆదివారం రాత్రి వార్తా కథనం రావటంతో ఆఘ మేఘాల మీద గ్రామంలో విచారణ వ్యవహారమై ప్రచారం నిర్వహించారు. విచారణ నిర్వహించేందుకు మధిర ఇన్స్పెక్టర్ హాజరవుతారని తెలిసింది. ఏది ఏమైనా వరుస దిశ కథనాలతో తపాలా శాఖ జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

Tags:    

Similar News