సంచలనాలకు మారు పేరు ' దిశ '..
పత్రికలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని, సంచలనాలకు మారుపేరుగా నిలుస్తూ తనకంటూ ఘనాపాటి చరిత్రను సాధించిన “దిశ” దినపత్రికని అభినందించారు.
దిశ, బోనకల్ : పత్రికలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని, సంచలనాలకు మారుపేరుగా నిలుస్తూ తనకంటూ ఘనాపాటి చరిత్రను సాధించిన “దిశ” దినపత్రికని అభినందించారు. మండల కేంద్రంలో చేబ్రోలు అగ్రో ఏజెన్సీస్ వ్యాపార ప్రాంగణంలో దిశ దిన పత్రిక నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, కాంగ్రెస్ మధిర నియోజకవర్గ మహిళా నాయకురాలు చేబ్రోలు రమా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగే సంఘటనలను, వార్తలను ర్యాపిడ్ వేగంతో దిశ పత్రిక ప్రచురితమవుతూ ప్రజలకు చేరవేస్తున్నాయని కొనియాడారు.
పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాయని, ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి తోడ్పడతాయని అన్నారు. అందుకే అమెరికా లాంటి ప్రజాస్వామ్య సమాజంలోనూ పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజా కోర్టుగా పేర్కొంటాయని తెలిపారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సమాజంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాల సమగ్ర సమాచారాన్ని పౌరులకు పత్రికలే అందజేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్ జక్కుల రామారావు, కాంగ్రెస్ మండల నాయకులు చేబ్రోలు వెంకటేశ్వర్లు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆకెన పవన్ తదితరులు పాల్గొన్నారు.