రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
దిశ, కామేపల్లి: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం రాత్రి ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి మండలం లచ్చతండా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో విఫలం చెందాయాని ఆరోపించారు.
కనీసం అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి అందించలేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సర్పంచులు అప్పుల పాలై చనిపోతున్నట్లు తెలిపారు. 2024 లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు మల్లు రవి, విజయ రమణారావు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, కామేపల్లి జడ్పిటిసి బి. వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, ఎంపీటీసీలు నల్లమోతు వెంకట నరసయ్య, పార్టీ నేతలు రెడబోత్ గోపిరెడ్డి, మద్దినేని రమేష్ బాబు, నల్లమోతు వెంకట నరసయ్య, దేవేండ్ల రామకృష్ణ, గుజ్జర్లపూడి రాంబాబు, దొడ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.