గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వెనకబడ్డ పర్యాటక రంగంః డిప్యూటీ సీఎం భట్టి

Update: 2024-08-21 14:25 GMT

దిశ, ఎర్రుపాలెం : గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పదేండ్లు పర్యాటక రంగం కుదేలైపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మండలంలోని పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జమలాపురం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. జమలాపురాన్ని రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఎనిద్రం చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు రెండు రోజులపాటు జమలాపురంలో గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. జమలాపురం టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ గత ప్రభుత్వ పాలకుల అలసత్వం వల్ల అభివృద్ధి జరగలేదు. జమలాపురం చెరువు అహ్లాదకరంగా ఉండేలా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేయించి జమలాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తామన్నారు. రెండవ జోన్ గా మార్చేందుకు అవసరమైన సర్వేలు, మ్యాపులు, ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. త్వరలోనే జీవో విడుదల అవుతుందని బడ్జెట్ లో అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ఎర్రుపాలెం మండలంలో మిగిలి ఉన్న రోడ్లను పూర్తి చేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రహదారులు నిర్మించి మండలం మొత్తం ఒక రింగ్ రోడ్డు లా అభివృద్ధి చేస్తామన్నారు. కట్టలేరు ఆధునికరణకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

మధిర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని ఎమోషనల్ అయ్యారు. మీరిచ్చిన అవకాశంతో ఆర్థిక మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయగలిగానని తెలిపారు. మండలంలో మీనవోలు గ్రామం నుండి బనిగండ్లపాడు గ్రామం వరకు ఒక కోటి 70 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం నుండి పెగళ్లపాడు గ్రామం వరకు రెండు కోట్ల 40 లక్షల రూపాయలు, కొత్తపాలెం నుండి గట్ల గౌరవరం గ్రామం వరకు 20 కోట్ల రూపాయలు, ఎర్రుపాలెం వయా జమలాపురం నుండి రాజుపాలెం వరకు రూ.25 కోట్ల రూపాయలు వెంకటాపురం నుండి బనిగండ్లపాడు వరకు ఆరు కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. సుమారు 60 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పిసిసి సభ్యులు శీలం ప్రతాపరెడ్డి, డిసిసిపి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు బండారు నరసింహారావు శీలం శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, అనుమోలు వెంకటకృష్ణారావు, తూల్లూరి కోటేశ్వరరావు రాయల నాగేశ్వరరావు, షేక్ ఇస్మాయిల్ మల్లెల లక్ష్మణరావు వేమిరెడ్డి అనురాధ, పూర్ణచంద్రారెడ్డి, అంకసాల శ్రీనివాసరావు నన్నపనేని రామారావు, కర్నాటి సుధాకర్ రెడ్డి, మూల్పూరి స్వప్న, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News