పంట నష్టాన్ని అంచనా వేయాలి
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి నివేదికలను వెంటనే అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
దిశ, ఎర్రుపాలెం : భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి నివేదికలను వెంటనే అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మండలంలోని మొలుగుమాడు, మీనవోలు గ్రామాల్లో గురువారం పర్యటించి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుకోకుండా కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కేంద్ర బృందాలు కూడా రాష్ట్రంలో ముంపు నష్టాన్ని అంచనా వేసేందుకు వస్తున్నాయన్నారు.
రెండు లక్షలపైన రుణాలున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి విషయంలో ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలను రూపొందించి అధికారులకు తగిన అదేశాలివ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, నల్లమల్ల వెంకటేశ్వరావు, నాయకులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బండారు నరసింహారావు, శ్రీనివాసరెడ్డి,నాగిరెడ్డి,పూర్ణ చంద్ర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ రావు,ఇస్మాయిల్, రాజీవ్ గాంధీ, వేజండ్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.