దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కొత్తగూడెం కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భూక్య రాంబాబు లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కాడు. జంపన్న అనే వ్యక్తి వద్ద పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ కొత్తగూడెం బస్టాండ్లో కోర్ట్ కానిస్టేబుల్ బుఖ్య రాంబాబు సోమవారం పట్టుబడ్డాడు. 2020లో జంపన్నపై అశ్వాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కొత్తగూడెం షెషన్ కోర్టులో ట్రైల్ కి రావడంతో కేసు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తాను అని బాధితుల నుండి 15000/ రూ. డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే బాధితుడు గత 20 రోజుల క్రితం ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో డీఎస్పీ సత్యనారాయణ బృందం సోమవారం డబ్బులు ఇస్తామని పిలిపించి పదివేల రూపాయలు నగదును రాంబాబుకు ఇచ్చినట్లు తెలిపారు. ఏసీబీ బృందం ఘటనా స్థలంలోనే రాంబాబును అదుపులోకి తీసుకోగా.. పరీక్షలు నిర్వహించి రాంబాబు డబ్బులు తీసుకున్నట్లు ధ్రువీకరించారు.