రెచ్చిపోతున్న కాపర్ వైర్ దొంగలు.. ఐదు గ్రామాల్లో 30 మోటార్ల వైర్లు చోరీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కాపర్ వైర్ల దొంగలు రెచ్చిపోయారు. బండారిగుంపు, రెడ్డిగూడెం, పాకాలగూడెం, తిరుమలకుంట, తోగ్గూడెం గ్రామాల్లో 30 వ్యవసాయ బోరు మోటార్ల వైర్ లు చోరీకి గురయ్యాయి.

Update: 2025-03-16 10:36 GMT

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కాపర్ వైర్ల దొంగలు రెచ్చిపోయారు. బండారిగుంపు, రెడ్డిగూడెం, పాకాలగూడెం, తిరుమలకుంట, తోగ్గూడెం గ్రామాల్లో 30 వ్యవసాయ బోరు మోటార్ల వైర్ లు చోరీకి గురయ్యాయి. ప్రధాన రహదారి పక్కన ఉండే వ్యవసాయ భూములే టార్గెట్ గా కాపర్ వైర్ చోరీలు జరిగాయి. విద్యుత్ మీటర్ బాక్స్ నుండి మోటారు వరకు ఉండే వైర్లను కత్తిరించి ఎత్తుకుపోయారు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. వైర్ లోని కాపర్ కోసమే ఇదంతా చేసి ఉంటారని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాత్రుళ్ళు దొంగలు ఈ విధంగా స్వైర విహారం చేస్తుండడంతో.. రాత్రి వేళల్లో పొలానికి వెళ్లాలంటేనే భయం వేస్తుందని రైతులు వాపోతున్నారు.

Read More..

ఇది సాగునీరు కాదు.. తాగునీరు 


Similar News