గ్రంథ పాలకుడు లేని గ్రంథాలయం.. స్వీపరే ఇక్కడ అన్ని..
ప్రజలకు విజ్ఞానం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం గ్రంధాలయం
దిశ, ఏన్కూర్ : ప్రజలకు విజ్ఞానం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం గ్రంధాలయం ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం గ్రంథ పాలకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న గ్రంథాలయానికి గ్రంథ పాలకుడు లేక ఇక్కడ స్వీపరే గ్రంథ పాలకుడు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది, మండలంలోని సుమారు 28 గ్రామాల నుండి నిత్యం ఏనుకూరు మండల కేంద్రానికి మూడు నుంచి 3500 మంది వివిధ పనుల నిమిత్తం వచ్చి గ్రంథాలయంలోకి పేపర్ చదివేందుకు ఇతర సమాచారాలు తెలుసుకునేందుకు నిత్యం రావడం జరుగుతుంది, వారికి కావలసిన విజ్ఞాన బండాగారాలు అందజేయడానికి గ్రామ పాలకుడు లేక గదికి తాళం వేసి ఉండటం గమనార్హం. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పాలన ప్రకారం గ్రంథ పాలు కూడా నిర్వహించాల్సిన విధులను స్వీపర్ నిర్వహించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక్కడ గతంలో పనిచేసిన గ్రంథ పాలకుడు ఉద్యోగ విరమణ చేయడంతో, ఖమ్మం నుంచి ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్న గ్రంధా పాలకుడు ఏదో చుట్టపు చూపుగా వారానికో 15 రోజులకు వచ్చి పోవడం స్థానికులను విస్మయానికి గురిచేస్తుంది. ప్రజలకు విజ్ఞానం అందించడానికి ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి వివిధ రకాల పుస్తకాలు, విద్యార్థులకు పరిజ్ఞానం అందించేందుకు బుక్స్, రోజువారి దినపత్రికలో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాటిని అందించడానికి గ్రంథ పాలకుడు లేకపోవడం వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా గ్రంథాలయ సెక్రటరీ ప్రత్యేక చొరవ తీసుకుని నిత్యం గ్రంథపాలకుడు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.