భూ దురాక్రమణదారులపై కేసు నమోదు..

ఏదులాపురం రెవెన్యూ లోని సర్వేనెంబర్ 215 లో గల వెంచర్ లో మెట్టు

Update: 2025-03-17 02:59 GMT
భూ దురాక్రమణదారులపై కేసు నమోదు..
  • whatsapp icon

దిశ, ఖమ్మం రూరల్: ఏదులాపురం రెవెన్యూ లోని సర్వేనెంబర్ 215 లో గల వెంచర్ లో మెట్టు అరుణకు చెందిన 363 గజాల ప్లాటును కొందరు దురాక్రమించారు. మట్టి పోసి, చుట్టూ ఫెన్సింగ్ వేశారు. విషయం తెలుసుకుని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. తమ ప్లాట్లో మట్టి, ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈ ప్లాట్ మాదంటూ బెదిరింపులకు దిగారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే చంపుతామంటూ బెదిరించారు. అట్రాసిటీ కేసు సైతం పెడతామంటూ రివర్స్ హెచ్చరించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏపూరి శ్రీహరి, ఏపూరి శివ అలియాస్ ప్రతాప్ తో పాటు వీరికి సహకరించిన వి.భుంజగరావుపై పోలీసులు ఆదివారం విచారణ చేశారు. వీరిపై ఖమ్మం రూరల్ పోలీసులు 329 (3), 324 (4), 296 (బీ), 351 (2), రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేశారు. దీనిలో నిందితుడిగా ఉన్న ఏపూరి శ్రీహరి పై గతంలో పలు సివిల్, క్రిమినల్ కేసులు సైతం నమోదు అయ్యాయి.


Similar News