ఏఐసీసీ కిసాన్ కేత్ నేషనల్ కో - ఆర్డినేటర్ గా ఖాజా గౌస్...
ఏఐసీసీ అనుబంధ కిసాన్ ఖేత్ విభాగానికి నేషనల్ కో - ఆర్డినేటర్ గా ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి, అల్ ఇండియా అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు యండి. ఖాజా గౌస్ మోహినుద్దీన్ ను ఆ విభాగ జాతీయ చైర్మన్ సుపాల్ సింగ్ ఖైరా నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
దిశ, ఇల్లెందు : ఏఐసీసీ అనుబంధ కిసాన్ ఖేత్ విభాగానికి నేషనల్ కో - ఆర్డినేటర్ గా ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి, అల్ ఇండియా అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు యండి. ఖాజా గౌస్ మోహినుద్దీన్ ను ఆ విభాగ జాతీయ చైర్మన్ సుపాల్ సింగ్ ఖైరా నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇల్లందుకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కాజా గౌస్ మోహినుద్దీన్ మాట్లాడుతూ తన పై నమ్మకంతో ఏఐసీసీ అనుబంధ కిసాన్ ఖేత్ విభాగానికి నేషనల్ కో - ఆర్డినేటర్ గా నియమించడం సంతోషకరమన్నారు.
తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు, టీపీసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ, రానున్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అదే విధంగా పూర్తిగా గిరిజన ప్రాంతమైన ఇల్లందుకు ఏఐసీసీ స్థాయిలో బాధ్యతలు రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.
Read More..