దిశ ఎఫెక్ట్.. సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం

సేవ్ భద్రాద్రి రెండు సంవత్సరాల క్రితం వరద బాధితుల సహాయార్ధం వసూలు చేసిన నిధులతో, గోదావరి వరదలు సమయంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి భద్రాద్రి వచ్చే ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు షెల్టర్ నిర్మాణం చేపట్టాలని ' దిశ ' కధనానికి సేవ్ భద్రాద్రి సేవా సంఘం స్పందించింది.

Update: 2024-08-20 08:03 GMT

దిశ, భద్రాచలం: సేవ్ భద్రాద్రి రెండు సంవత్సరాల క్రితం వరద బాధితుల సహాయార్ధం వసూలు చేసిన నిధులతో, గోదావరి వరదలు సమయంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి భద్రాద్రి వచ్చే ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు షెల్టర్ నిర్మాణం చేపట్టాలని ' దిశ ' కధనానికి సేవ్ భద్రాద్రి సేవా సంఘం స్పందించింది. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేవ్ భద్రాద్రి అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానం పక్కన గల 20 సెంట్లు భూమిలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని, ఈ నెల 28 న భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ హల్ నిర్మాణం వలన ఎన్‌డి‌ఆర్‌ఎఫ్ బృందాలకు వసతి కల్పించడంతో పాటు వరద భాధితులకు షెల్టర్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ. 36,91,000 దాతలు సహకరించారని అన్నారు. సుమారు కోటి రూపాయల నిధులతో ఈ హాల్ నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ భద్రాద్రి కార్యదర్శి చారుగుళ్ల శ్రీనివాస్, ట్రెజరర్ ఎస్ కే అజీమ్, సభ్యులు పరిమి సోమ శేఖర్, గాదె మాధవ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News