ఖమ్మంలో 10/10 సీట్లు కాంగ్రెస్ వే..

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10/10 సీట్లు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-11-02 12:18 GMT

దిశ, కామేపల్లి : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10/10 సీట్లు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పాత లింగాలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రంలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు మానుకొండ రాధా కిషోర్, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మేకల మల్లిబాబు యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు రెడబోత్ గోపిరెడ్డి, ఎంపీటీసీలు రాంరెడ్డి జగన్నాథ్ రెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య, దమ్మలపాటి సత్యనారాయణ, గుజ్జర్లపూడి రాంబాబు, దేవేండ్ల రామకృష్ణ, నల్లమోతు వెంకట నరసయ్య,భావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News