కాంగ్రెస్ భారీ ర్యాలీ

మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు..Congress Rally at Julurpadu

Update: 2022-11-24 08:46 GMT

దిశ, జూలూరుపాడు: మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి, సీఎల్పి నేత భట్టి విక్రమార్క పిలుపు మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాటిని విస్మరించి ఒంటెద్దు పోకడను నిరసిస్తూ ఉదయం 10 గంటలకు మండల కేంద్రం నుండి ర్యాలీగా బయలుదేరి, స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి తహశీల్దార్ లూథర్ విల్సన్ కి వినతిపత్రం అందజేశారు.

అనంతరం మీడియా సమావేశంలో రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేయాలని, రైతులు పండించిన వరి పంటను వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ధరణి పోర్టల్ లో ఉన్న తప్పులను సరిచేసి భూ హక్కు పట్టాలు ఇవ్వాలని, సక్రమంగా ప్రతి రైతుకు రైతుబంధు బీమా పథకం వర్తింపజేయాలనే డిమాండ్ తో పాటు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణయ్య, ఉపాధ్యక్షులు లకావత్ లచ్చునాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చాపలమడుగు నరసింహారావు, ముఖ్య సలహాదారులు ముత్తినేని రామయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంద బాబు, కిసాన్సెల్ మండల అధ్యక్షులు తాళ్లూరి అచ్చయ్య, తాటికొండ ప్రసాద్, హుస్సేన్, బానోత్ బాబు, స్వామి నవీన్, ప్రవీణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News