'నన్నుచూడు నా అందం చూడు అన్నట్లు ఉంది సభ'
నున్ను చూడు... నా అందం చూడు అన్నట్లు ఖమ్మం ఆశీర్వాద సభ ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, జావీద్ లు ఎద్దేవా చేశారు.
దిశ, ఖమ్మం : నున్ను చూడు... నా అందం చూడు అన్నట్లు ఖమ్మం ఆశీర్వాద సభ ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, జావీద్ లు ఎద్దేవా చేశారు. సోమవారం ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిన్న కేసీఆర్ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చెప్పారని విమర్శించారు. గతంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే.. నిన్న కేసీఆర్ చెప్పిన అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గోళ్లపాడు చానల్ ప్రాంతంలో సందర్శించినప్పుడు మీ పక్కన ఎవరు ఉన్నారో తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడారని చెప్పారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో ఉన్న డివైడర్లకు నాలుగు చైనా లైట్లు చూట్టరే తప్ప ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో యువకుల ఆత్మబలిదానాలు చూసి సోనియా గాంధీ చలించి రాష్ట్ర ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆశీర్వాద సభలో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పకుండా... మాయ మాటలు చెప్పివెళ్లారని వారు చెప్పారు. కేసీఆర్ చెప్పే మాటలను ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారెంటీ కార్టు చూసి, ఈ నెల తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10 కి 10 స్థానాలు గెలవడం ఖాయమన్నారు.
కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్ పార్టీతో సంతోష గా ఉన్నారు.. అనిల్ కుమార్
తెలంగాణ, కర్ణాటక బార్డర్ లో ఉన్న కొంతమందిని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ అన్నారు. నేను కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడిని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేసే గ్యారెంటీ కార్టు పధకం కోసం రూ.32 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని, రాబోయే ఎన్నికల్లో కుటుంబ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.