ముదిగొండలో కాంగ్రెస్ ప్రచార రథం ప్రారంభం..
మండల పరిధిలోని యడవల్లి గ్రామంలో కొలువై ఉన్న యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు.
దిశ, ముదిగొండ : మండల పరిధిలోని యడవల్లి గ్రామంలో కొలువై ఉన్న యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచార రథాన్ని ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ, మండల ప్రచార కమిటీ ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ భట్టి విక్రమార్క ముదిగొండ మండల ఎన్నికల ప్రచార షెడ్యుల్‌ను విడుదల చేశారు.
ఈ నెల 4వ వారికి - యడవల్లి, యడవల్లి లక్ష్మీపురం, మేడేపల్లి, కట్టకూరు, సీతరాంపురం, దనియాల గూడెం, మాధాపురం 5వ తేదిన మల్లన్నపాలెం, పమ్మి, చిరుమర్రి, సువర్ణపురం, ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి గ్రామంలో ప్రచారాలు జరగునునట్టు, ఈ ప్రచారాలకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమలో మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, మధిర ప్రచార కమిటీ చైర్మన్ మట్టా రవీందర్ రెడ్డి, మధిర బి బ్లాక్ అధ్యక్షులు కందిమళ్ళ వీరబాబు, సమన్యాయ కమిటీ చైర్మన్ బుల్లెట్ బాబు, మండల నాయకులు మల్లెల అజయ్, ఆదినారాయణ రెడ్డి, వల్లురి భధ్రరెడ్డి, చెరుకుపల్లి రాంబాబు, వినోద్, అస్గర్, వెంకటరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.