దిశ క్లిక్.. ఆ ప్రేమ మరువలేనిది...
ఇద్దరు పిల్లల పై ఓ తండ్రికి ఉన్న ప్రేమ అంత ఇంత కాదు. చిన్నప్పటి నుంచి ఇద్దరిని అల్లారుముద్దుగా పెంచారు.
దిశ, మణుగూరు : ఇద్దరు పిల్లల పై ఓ తండ్రికి ఉన్న ప్రేమ అంత ఇంత కాదు. చిన్నప్పటి నుంచి ఇద్దరిని అల్లారుముద్దుగా పెంచారు. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏజెన్సీలో జీవనం కొనసాగిస్తూ తాను తినేది కారం మెతుకులు అయిన తన ఇద్దరు పిల్లలకు కారం మెతుకులు పెట్టకుండా నచ్చిన, కోరుకున్న ఆహారం పెడుతున్నారు. ఒళ్ళంతా హూనం చేసుకొని తన ఇద్దరి పిల్లలను తన రెక్కల కింద కాపాడుకుంటున్నారు. ప్రతి ఇంటికి బైక్ లేదా కారు ఉన్న రోజులివి.
మార్కెట్ లోకి పోవడానికి అవేవి లేకపోయిన తనకు ఉన్న ఒకే ఒక్క సైకిల్ పైనే ఇద్దరు పిల్లల్లను తిప్పుతూ వారిని సంతోష పెడుతూ ఆ తండ్రి ఎంతో సంతోష పడుతున్నారు. హృదయానికి హత్తుకునే ఈ ఫోటో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో దిశ కంటికి చిక్కింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను అల్లారు ముద్దుగా సైకిల్ మీద తిప్పుతూ ఉన్న ఈ సన్నివేశం పలువురిని కూడా ఎంతో సంతోష పరిచింది.