అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ లారీ దగ్ధం..
సత్తుపల్లి మండలం జగన్నాధపురం గ్రామం నుంచి సత్తుపల్లికి మట్టి తరలిస్తున్న టిప్పర్ సత్తుపల్లి శివారులో షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన సంఘటన గురువారం ఉదయం సత్తుపల్లిలో చోటుచేసుకుంది.
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండలం జగన్నాధపురం గ్రామం నుంచి సత్తుపల్లికి మట్టి తరలిస్తున్న టిప్పర్ సత్తుపల్లి శివారులో షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన సంఘటన గురువారం ఉదయం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం జగన్నాధపురం గ్రామం నుంచి సత్తుపల్లి పట్టణానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ లారీ సత్తుపల్లి శివారులో ఇంజన్ లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
అప్రమత్తమైన డ్రైవర్ స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంజన్ దగ్ధంతో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండొచ్చునని అంచనా. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది డ్రైవర్ బాబురావు నండ్రు ప్రకాశం, ఎగిసిపడుతున్న మంటలను ఇద్దరు చాకచక్యంగా వ్యవహరించి మంటలు అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.