Lawrence Bishnoi : గురుగ్రామ్‌లో బాంబు పేలుడు మా పనే.. లారెన్స్ అనుచరుల ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి(Lawrence Bishnoi) గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉన్నా.. అతడి గ్యాంగ్ మాత్రం దేశంలో అరాచకాలకు తెగబడుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి(Lawrence Bishnoi) గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉన్నా.. అతడి గ్యాంగ్ మాత్రం దేశంలో అరాచకాలకు తెగబడుతోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం రోజు హర్యానాలోని గురుగ్రామ్(Gurugram) సెక్టార్ 29లో ఉన్న ఓ బార్ వెలుపల నాటుబాంబు(Bomb Explosion) పేలిన ఘటనలోనూ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉందని వెల్లడైంది. ఆ దాడిని తామే చేయించామని లారెన్స్ గ్యాంగ్ అనుచరులు రోహిత్ గడర్, గోల్డీ బ్రార్‌లు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
ఆ బార్ యజమాని అక్రమ మార్గాల్లో రూ.కోట్లు సంపాదిస్తూ, పన్నులు ఎగ్గొట్టి దేశానికి నష్టం కలిగిస్తున్నారని వారు ఆరోపించారు. అందరూ పన్నులు చెల్లించాల్సిందేనని రోహిత్ గడర్, గోల్డీ బ్రార్ హెచ్చరించడం గమనార్హం. ‘‘మంగళవారం రోజు జరిగింది చిన్న పేలుడే అని తేలిగ్గా తీసుకోవద్దు. భారీ పేలుళ్లు చేయగల సామర్థ్యం మాకు ఉంది’’ అని వార బెదిరింపులకు దిగారు. ఇక ఈ పోస్ట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దాడికి సంబంధించి సచిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి మరో రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.