ఒడిస్సా టు హర్యానా.. రూ. 50 లక్షల గంజాయి సీజ్
ఒడిస్సా నుండి హర్యానా తరలిస్తున్న రు. 50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
దిశ, భద్రాచలం : ఒడిస్సా నుండి హర్యానా తరలిస్తున్న రు. 50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం సరిహద్దు ఆంధ్ర కూనవరం సీఐ కన్నరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిస్సా రాష్ట్రం కలిమెలలో గంజాయి కొనుగోలు చేసి, 25 బస్తాలు లారీలో తరలిస్తున్నారని సమాచారం. ఈ సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, లారీ సీజ్ చేసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.