పోగొట్టుకున్న 220 మొబైల్ ఫోన్లు రికవరీ
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందజేసినట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందజేసినట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టినట్టు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 220 మంది బాధితులకు ఎస్పీ కార్యాలయంలో తిరిగి వారి ఫోన్లను అప్పగించారు.
మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెడతామని అన్నారు. బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.