సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. రుణమాఫీపై కీలక చర్చ?
లోక్ సభ పోలింగ్ ముగియడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫోకస్ పెట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ పోలింగ్ ముగియడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫోకస్ పెట్టారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కాగా ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వానాకాలంలో పంటల సాగు అంశంతో పాటు సాగునీటి రంగంలో ఇటీవల చోటు చేసుకున్న తాజా పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.