బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ పై కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశం (Betting Apps Promotion) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇందులో పలువురు బుల్లి తెర నటులు, యాంకర్స్ పై పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) కేసు నమోదు చేశారు. అయితే వీరితో పాటు ఆన్ లైన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ (Habibnagar Police Station) లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ గౌడ్.. టెలిగ్రామ్ లో కిరణ్ గౌడ్ అనే పేరుతో ఉన్న చానెల్ లో బెట్టింగ్ టిప్స్ (Betting Tips) ఇచ్చేవాడు. ఇదిలా ఉండగా.. కిరణ్ గౌడ్ పోలీస్ యూనిఫాంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం గమనార్హం.
కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఇందులో ఆయన పాత్రపై దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇతర వ్యక్తులపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామలకు (YSRCP Leader Shyamala) పోలీసులు నోటీసులు (Notices) అందజేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో ఉన్న మరికొందరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
Read More..
తెలంగాణ పోలీసుల దూకుడు.. 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయొద్దంటూ హర్షసాయి అనూహ్య పోస్ట్