మరో కాంగ్రెస్ నేతకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధిష్టానం
సొంత పార్టీలో జరుగుతున్న వివాదాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: సొంత పార్టీలో జరుగుతున్న వివాదాలపై కాంగ్రెస్ అధిష్టానం (Congress leadership) సీరియస్ యాక్షన్ (Serious action) తీసుకుంటుంది. ఇందులో భాగంగా పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఖరి ఉండటంతో మల్లన్నకు షోకాజ్ నోటీసులు (Show Cause Notices) జారీ చేసి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో నేతకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల మంత్రి సీతక్క(Minister Sitakka) పై సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రావి శ్రీనివాస్ (Ravi Srinivas) పలు విమర్శలు చేశారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతలు క్రమశిక్షణ కమిటీకి (Disciplinary Committee) ఫిర్యాదు చేశారు. పార్టీ నేతల నుంచి రావి శ్రీనివాస్ పై పలు ఫిర్యాదులు అందుకున్న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ (Congress Party Disciplinary Committee) .. రావి శ్రీనివాస్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ, TPCC, మీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులను అందుకుంది. మీరు మీడియా సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిని విమర్శించారు. అంతేకాకుండా, ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మీరు INC పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారు. DCC నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని. క్రమశిక్షణ కమిటీ మీకు షోకాజ్ నోటీసులు అందజేయాలని నిర్ణయించింది. ఈ షోకాజ్ నోటీసు తేదీ నుండి ఒక వారంలోపు మీ వివరణను 2025 మార్చి 28న లేదా అంతకు ముందు సమర్పించాలి. లేకుంటే మీరు ఎటువంటి వివరణ ఇవ్వలేరని భావించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు, విధానం ప్రకారం మీపై కఠినమైన చర్యలు తీసుకుంటాము అని క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.