KTR: కేంద్రం బిగ్ బ్రదర్లా ఉండాలి.. బిగ్‌బాస్లా కాదు: కేటీఆర్
డీలిమిటేషన్ (Delimitation)పై చర్చించేందుకు తమిళనాడు (Tamilnadu)లో అధికార డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం (All-Party Meeting) కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేషన్ (Delimitation)పై చర్చించేందుకు తమిళనాడు (Tamilnadu)లో అధికార డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం (All-Party Meeting) కొనసాగుతోంది. చెన్నై (Chennai)లోని హోటల్ ఐటీసీ చోళ (ITC Chola)లో సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) అధ్యక్షతన జరుగుతోన్న ఈ భేటీలో రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్తో ఎన్నో నష్టాలు ఉన్నాయని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్రం వివక్షతో ఇప్పటికే సౌత్ స్టేట్స్ (South States) వెనుకబడ్డాయని, ఆర్థికంగా చితికిపోతున్నాయని కామెంట్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అంకెలు పాలసీలను శాసించే పరిస్థితి ఉండకూదని తెలిపారు.
బాగా రాణించే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని అన్నారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అనేక రంగాల్లో దక్షణాది రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని, కానీ తమ రాజీకీయ శక్తిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించబోదని అన్నారు. కేంద్ర వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు దక్కుతోంది తక్కువేనని కామెంట్ చేశారు. జనాభా ప్రాతిపదకన లోక్‌సభ సీట్లు (Lok Sabha Seats) పెరిగితే.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. దాంతో ప్రాంతీయ అసమానతలు కూడా తలెత్తవచ్చని తెలిపారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కేంద్రం బిగ్ బ్రదర్లా ఉండాలి కానీ.. బిగ్‌బాస్లా వ్యవహరించకూడదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.