మంత్రి పదవిపై మనసులో మాట బయటపెట్టిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మరో ఆరు మంత్రి బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలోనే కేబినెట్ విస్తరణ సైతం

Update: 2024-07-30 13:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మరో ఆరు మంత్రి బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలోనే కేబినెట్ విస్తరణ సైతం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి గిరీ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిపై తన మనసులోని మాటను బయటపెట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ కేబినెట్‌లో అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను నేనేనని గుర్తు చేశారు. ఆషాడ మాసం తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలో 64 ఎమ్మెల్యే సీట్లు గెలిచి స్పష్టమైన మెజార్టీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి.. రంగారెడ్డి, హైదరాబాద్ ఫలితాలు మాత్రం నిరాశ మిగిల్చాయి. రంగారెడ్డి నుండి మల్ రెడ్డి ఒక్కరే విజయం సాధిచంగా.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. దీంతో రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఈ జిల్లాల నుండి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై మల్‌రెడ్డి రంగారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.


Similar News