Ambati Rambabu : సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీపై అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో టాలీవుడ్ సినీ ప్రముఖుల(Film Celebrities) భేటీ(Meeting)పై ఆంధ్రప్రదేశ్(AP) మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu)ఎక్స్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-12-26 09:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో టాలీవుడ్ సినీ ప్రముఖుల(Film Celebrities) భేటీ(Meeting)పై ఆంధ్రప్రదేశ్(AP) మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu)ఎక్స్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 సినిమాలోని ‘సోఫా’ అంశాన్ని తెరమీదకి తీసుకొస్తూ తన ఎక్స్ ఖాతాలో షాకింగ్ ట్వీట్ చేశారు. పూర్తి పరిష్కారానికి "'సోఫా" చేరాల్సిందే! అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు పోస్టు చేశారు. పుష్ప-2 సినిమాలో హీరో తనకు కావాల్సిన పని కోసం ‘సోఫా’లో డబ్బులు పెట్టి పంపిస్తుండటం తెలిసిందే. అదే అంశంతో సీఎం రేవంత్.. సినీ ప్రముఖుల భేటీని పోల్చుతూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సినిమా ఇండస్ట్రీ సమస్యల పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాల్సిందేనన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే బీజేపీ నేతలు సైతం అల్లు అర్జున్ అరెస్టు వివాదంలో, సినీ ఇండస్ట్రీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరి వెనుక డబ్బుల వ్యవహారమే ఉందంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అదే అర్ధం వచ్చేలా కామెంట్స్ చేయడం విశేషం.

Tags:    

Similar News