TG-TET: అభ్యర్థులకు అలర్ట్.. టెట్ హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

Update: 2024-12-26 09:05 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరగనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను నేడు(డిసెంబర్ 26) అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు వారి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్‌కు 2,48,172 మంది అప్లై చేసుకున్నారు. విద్యాశాఖ ఇప్పటికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం.. 2025 జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ టీజీ టెట్‌ సిలబస్‌ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.

Tags:    

Similar News