Murali Mohan : అల్లు అర్జున్ ఘటనపై సీఎం రేవంత్ మాట్లాడలేదు : మురళీమోహన్

అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీలో ప్రత్యేకంగా ఏమి మాట్లాడలేదని సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) తెలిపారు.

Update: 2024-12-26 08:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీలో ప్రత్యేకంగా ఏమి మాట్లాడలేదని సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) తెలిపారు. సమావేశంలో అల్లు అర్జున్ వివాదంపై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేకంగా ప్రస్తావించకుండా జనరలైజ్ గా మాట్లాడారన్నారు. ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశం మాత్రమేనని మురళీమోహన్ పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు, విభేధాలుంటే వాటిని సరిచేసుకుని సమన్వయంతో ముందుకెలుదామని సీఎం చెప్పారన్నారు. ఇండస్ట్రీకి కావాల్సినవన్ని చేస్తామన్నారని మీ సహకారం కూడా ప్రభుత్వానికి ఉండాలన్నారన్నారు.

బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపుపై పునరాలోచన చేస్తామన్నారని.. త్వరలోనే అవార్డుల ప్రధానోత్సం చేస్తామన్నారని మురళీ మోహన్ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని, సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల..ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నారన్నారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News