కవిత అరెస్ట్ చట్ట విరుద్ధం.. లాయర్ విక్రమ్ చౌదరి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషిన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Update: 2024-04-12 09:54 GMT
కవిత అరెస్ట్ చట్ట విరుద్ధం.. లాయర్ విక్రమ్ చౌదరి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషిన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. వాదనలు సందర్భంగా కవిత అరెస్ట్‌పై ఆమె తరుఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేయడానికి అసలు ఎలాంటి కేసు లేదని అన్నారు. సెక్షన్ 41ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితకు వ్యతిరేకంగా సీబీఐ చెబుతోన్న సాక్ష్యాలకు విలువ లేదని అన్నారు. కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని.. లిక్కర్ కేసులో ఆమె అరెస్ట్, రిమాండ్‌ను కొట్టేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత అరెస్ట్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న స్పెషల్ కోర్టు.. మరి కాసేపట్లో సీబీఐ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది. దీంతో కవితకు ఊరట లభిస్తుందా లేదా సీబీఐ వాదనలతో ఏకీభవించి న్యాయస్థానం ఆమెను కస్టడీకి అప్పగిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News