తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కిషన్ రెడ్డి మంచిర్యాలలో పర్యటించారు.

Update: 2024-02-23 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కిషన్ రెడ్డి మంచిర్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలోనే దేశానికి భద్రత పెరిగిందని అన్నారు. అందుకే పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా మూడోసారి కూడా మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలన నీతివంతంగా సాగిందని చెప్పారు. తీవ్రవాదం, ఉగ్రవాదం తగ్గి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు బీజేపీ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 370 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. అంతేకాదు.. తెలంగాణలోని 17కు 17 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఉండబోదని కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. కేంద్రంలో రాని కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేయొద్దని సూచించారు.

Tags:    

Similar News