KTR మామ మృతి.. సంతాపం తెలిపిన KCR

తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు (72) మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని

Update: 2022-12-29 11:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు (72) మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్లి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు. హరినాథరావుకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం మధ్యాహ్నం మృతి చెందారు.

Also Read... 

తెలంగాణ ఇన్‌చార్జి డీజీపీగా అంజనీకుమార్ 

Tags:    

Similar News