రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన యువకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రం రోడ్డు విస్తరణ లో

Update: 2024-09-09 08:58 GMT

దిశ,వీర్నపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రం రోడ్డు విస్తరణ లో భాగంగా కాంట్రాక్టర్ నెలన్నర క్రితం బీటీ రోడ్డు తొలగించి వేగంగా పనులు పూర్తి చేయకపోవడంతో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురద మయంగా మారింది . నడవడానికి కూడా వీలు లేకుండా అధ్వానంగా మారిందని యువకులు ఆరోపించారు. అధికారుల నాయకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన పరిష్కరించక పోవడంతో రోడ్డుపై వరి నాట్లు వేసి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు బురదమయంగా మారడంతో వాహనదారులు అదుపుతప్పి బురదలో పడిపోతున్నారని తెలిపారు. వారం క్రితం ఆర్టీసీ బస్సు బురదల కోరుకపోవడంతో స్థానిక యువకుల సహాయంతో బయటకు తీశారు . ఇప్పటికైనా రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో పిట్ల నాగరాజు, తౌటు అజయ్, ఒగ్గు అనిల్ ,పెద్దవేని ప్రవీణ్, బోయిని నవీన్,మనోజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


Similar News