Former MLA Rasamayi Balakishan: కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే

Update: 2024-10-28 13:25 GMT

దిశ, తిమ్మాపూర్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. సోమవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అధినేత కేసీఆర్ కుటుంబం పై కాంగ్రెస్ కక్ష కడుతుందని విమర్శించారు. పత్రికలపై దాడులు చేస్తూ ప్రశ్నించే గొంతును కూడా నొక్కేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు నేడు గద్దెనెక్కిన విషయం యాదికి లేదా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో మేము ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదని, భావస్వేచ్చ ప్రకటన హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు.

రైతులకు నీళ్ళెవ్వి..?రైతుబంధు ఏది..? ధాన్యం కొనుగోలు ఎవ్వి..? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు లేక రైతులు విధి లేక తమ పంటలను దళారులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులు, వాస్తవాలను రాసే మీడియా ఛానళ్లపై దాడులకు ఊరుకునేది లేదని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లె.. పట్టణం తేడా లేకుండా జనం గోసపడుతున్నరని విమర్శించారు. కేటీఆర్ పై కేంద్ర మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

కమీషన్ల కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో కొందరు అమ్ముడుపోయిన నాయకులు పిచ్చికుక్కల మాదిరిగా తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధని చెప్పుకునే ఓ నాయకుడు తప్పు చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే అతనిపై చర్యలు తీసుకోకుండా తనకు అంటగట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే స్క్రిప్ట్ రాసి ఇస్తే మాట్లాడిన నాయకులకు ఏమైనా లాభం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. అరుంధతి కల్యాణ మండపాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు బోయిని కొమురయ్య, మాతంగి లక్ష్మణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News