సమ్మర్లో పనులను వేగంగా పూర్తి చేయాలి
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సమ్మర్ సీజన్ లో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
దిశ,పెద్దపల్లి : పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సమ్మర్ సీజన్ లో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మతు పనులు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మతు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలల హాస్టళ్ల మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు.
అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ సమ్మర్ సీజన్ పూర్తయ్యే లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ కింద మంజూరు చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి మార్చి 20లోపు బిల్లులు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ గిరీష్ బాబు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.