ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం

ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

Update: 2025-03-16 11:41 GMT

దిశ, కథలాపూర్ : ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో పలువురికి మంజూరైన 10 లక్షల 77 వేల విలువ గల 28 సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు.

    ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల మేరకు పెంచడం జరిగిందని అన్నారు. అలాగే ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుండ్ర నారాయణ రెడ్డి, వైస్ చైర్​పర్సన్ పులి శిరీష-హరిప్రసాద్, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, మండల అధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు ఎండీ. అజీమ్, డైరెక్టర్ జవ్వాజి చౌదరి, వంశీ, ఆకుల సంతోష్ పాల్గొన్నారు. 


Similar News