'ప్రజల ఆశీర్వాదంతో గెలిచా.. ప్రజల్లో ఉంటూ సేవ చేస్తా'
ప్రభుత్వం ద్వారా అమలు అయ్యే పథకాలలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ప్రజల వద్దకు వెళ్లి అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
దిశ, పెగడపల్లి : ప్రభుత్వం ద్వారా అమలు అయ్యే పథకాలలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ప్రజల వద్దకు వెళ్లి అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 88 మందికి మంజూరు అయిన ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అయిదు వందల రూపాయల విలువగల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అమలు అయ్యే పథకం అమలు కోసం అయిన ప్రజలు తిరగాల్సిన పనిలేదు అని, ప్రజల వద్దకే అందిస్తాం అని అన్నారు. గెలిచిన ఓడిన ప్రజల్లో ఉన్నానని ప్రజలంతా ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచానని ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేస్తానని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లానని అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని కావున నియోజక వర్గంలో అర్హులు అయిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి అప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేశామని, మిగతా హామీలు కూడా అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు బతికేపల్లి గ్రామంలో కారు ఢీ కొట్టడంతో మృతి చెందిన అన్నదమ్ములు సయ్యద్ సర్వర్, సయ్యద్ జకీర్ కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మండల తహశీల్దార్ రవీందర్, ఆర్ఐ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒరుగలి శ్రీనివాస్, నాయకులు సంధి మల్లారెడ్డి, కడారి తిరుపతి, అమిరిశెట్టి మల్లా రెడ్డి, కొండ మధుసూధన్ రెడ్డి, ది కొండ మహేందర్, ఛాట్ల విజయ్ భాస్కర్, చాట్ల ప్రశాంత్, శ్రీరాం అంజయ్య, మామిడాల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.