మహిళా మోర్చ జిల్లా మాజీ అధ్యక్షురాలికి అవమానం

మహిళా మోర్చ జిల్లా మాజీ అధ్యక్షురాలికి అవమానం జరిగింది.

Update: 2025-03-16 08:41 GMT

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : మహిళా మోర్చ జిల్లా మాజీ అధ్యక్షురాలికి అవమానం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా నూతన అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి నవీన్ యాదవ్ అవమానానికి గురయ్యారు.

    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరైన ఈ కార్యక్రమంలో వేదికపైకి తాజా, మాజీ అధ్యక్షులను పిలిచిన క్రమంలో మాజీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అయిన వెంకటలక్ష్మిని పిలవకపోవడం అవమానంగా భావించి అక్కడి నుండి వెనుతిరిగారు. రాష్ట్రంలో బీజేపీ ఏకైక సింగిల్ విండో చైర్మన్గా, కేటీఆర్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా పార్టీలో పనిచేసినట్లు ఆమెకు మంచి గుర్తింపు ఉంది. 


Similar News