బద్దెనపల్లికి ఎన్నికలు జరిగేనా?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాలపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామపంచాయతీకు ఎన్నికలు నిలిచిపోయాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో బద్దెనపల్లికి ఎన్నికలు జరుపొద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో అప్పుడు నిలిచిపోయాయి.

Update: 2023-04-10 02:11 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాలపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామపంచాయతీకు ఎన్నికలు నిలిచిపోయాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో బద్దెనపల్లికి ఎన్నికలు జరుపొద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో అప్పుడు నిలిచిపోయాయి. కాగా, ప్రభుత్వం జనం ప్రాతిపదికన రిజర్వేషన్ ఖరారు చేయగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ ఉండడంతో బదనపల్లికి ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు నిలిపేస్తూ కోర్టు స్టే ఆర్డర్ ఇస్తూ ఎలక్షన్స్ జరుపొద్దని నోటీస్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఎలక్షన్లను వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించి గ్రామం పంచాయతీని నిర్వహిస్తోంది. నేడు మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఇప్పటికైనా గ్రామానికి ఎన్నికలు నిర్వహించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.


దిశ, రాజన్నసిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాలపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామపంచాయతీకు ఎన్నికలు నిలిచిపోయాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో బద్దెనపల్లికి ఎన్నికలు జరుపొద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో అప్పుడు నిలిచిపోయాయి. కాగా, ప్రభుత్వం జనం ప్రాతిపదికన రిజర్వేషన్ ఖరారు చేయగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ ఉండడంతో బదనపల్లికి ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు నిలిపేస్తూ కోర్టు స్టే ఆర్డర్ ఇస్తూ ఎలక్షన్స్ జరుపొద్దని నోటీస్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఎలక్షన్లను వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించి గ్రామం పంచాయతీని నిర్వహిస్తోంది. అయితే బదనపల్లి పరిధిలో గురుకుల పాఠశాల ఉంది. పాఠశాలలో ఎక్కువ మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటారు. దీంతో వారిని పంచాయతీ జనాభా లెక్కల్లో చూపించారని అపోహతో ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలని కోర్టు మెట్లు ఎక్కినట్లు సమాచారం. కాగా, తప్పుడు సమాచారంతో కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఇలా జరగడం..

2019లో ఎన్నికలు నిలిచిపోవడంతో పాలకవర్గం లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుంది. గ్రామ ప్రజలు, నాయకులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, మండిపడుతున్నారు. పంచాయతీ పాలకవర్గం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పలువురు వాపోతున్నారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. కానీ తమ గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో గ్రామాన్ని పట్టించుకునే వారు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024లోనైనా తమ గ్రామపంచాయతీకి ఎన్నికలు జరుగుతాయా..? అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మాపై ఎందుకు వివక్ష..?

ప్రభుత్వం ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించినా తాము ప్రభుత్వానికి కట్టుబడి ఓట్లు వేస్తున్నామని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేధావులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏ కోర్టు మెట్లు ఎక్కడం లేదని తెలుపుతున్నారు. ప్రభుత్వమే ఎస్సీ రిజర్వేషన్ చేసినప్పుడు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి ఎస్సీ సర్పంచ్‌గా కొనసాగడం ఇష్టం లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీలు సర్పంచ్‌లైతే అభివృద్ధి జరగదా..? ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పట్టించుకుని ఇప్పటికైనా బద్దెనపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News