పాఠశాలల్లో నాణ్యమైన భోజనం వడ్డించాలి
పాఠశాలల్లో నాణ్యమైన భోజనం వడ్డించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : పాఠశాలల్లో నాణ్యమైన భోజనం వడ్డించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నాణ్యమైన భోజనంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలపై నాణ్యత ఉండాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరారు.
ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ సేఫ్టీ, టేస్ట్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, గౌతమ్ రెడ్డి, జిల్లా బీసీ, ఎస్సీ,వెల్ఫేర్ అధికారులు, ఆర్డీఓలు మధుసూదన్, జి.వాకర్ రెడ్డి, శ్రీనివాస్, డీఆర్డీఓ రఘువరన్ పాల్గొన్నారు.