మత్స్యకారుడికి చిక్కిన అరుదైన చేప
జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది.
దిశ, జగిత్యాల, కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. తులసినగర్ కు చెందిన నవీన్ వలకు సక్కరమౌత్ క్యాట్ ఫిష్ అనే అరుదైన చేప చిక్కింది. ఈ చేపని మార్కెట్ కి అమ్మకానికి తీసుకొని రాగా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి చేపలు అరుదుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలోని మంచి నీటిలో ఉంటాయని, దీనిని ఇంకా కామన్ ప్లేకో లేదా స్టోమస్ అని కూడా అంటారని నవీన్ వివరించాడు.