Whip : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతులను రాజుగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-11-02 11:16 GMT

దిశ, కథలాపూర్ : రైతులను రాజుగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం లోని భూషణ్ రావు పేట, కథలాపూర్, సిరికొండ గ్రామాల్లో శనివారం పాక్స్, ఐ కే పి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం విషయంలో దళారీల చేతిలో మోసపోతున్న సంఘటనలను చూసి నాటి దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలాగే దాని నిర్వహణను కూడా పూర్తిగా మహిళా సంఘాలకు అప్పగించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలిపారు. దీంతో మహిళా సాధికారతకు అప్పుడే బీజం పడిందని తెలిపారు. రైతులకు మరింత మేలు కలిగే కార్యక్రమాలను ముందు ముందు చేపడతామని అన్నారు. అలాగే రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

     ప్రతి రైతుకు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. అంతే కాకుండా సన్నాలకు ప్రభుత్వం చెప్పినట్టు 500 రూపాయల బోనస్ ను కల్పిస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే తూకం వేస్తారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చూడాలని అన్నారు. కథలాపూర్ మండల కేంద్రంలో 220 కేవీ సబ్ స్టేషన్ మంజూరైందని తెలిపారు. అలాగే సిరికొండ గ్రామస్తుల కోరిక మేరకు 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కుపైడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్దినేని నాగేశ్వరావు, మండల అధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు అజీమ్, పీసీసీ కార్యవర్గ సభ్యులు తోట్ల అంజయ్య, చెదలు సత్యనారాయణ, పులి హరిప్రసాద్, వెల్చాల సత్యనారాయణ, ఊర్మల్ల చారి, బైరా దేవా, మండళోజి చారి, గుండేటి గంగాధర్, ఆమెట ప్రేమ్ కుమార్, కల్లెడ గంగాధర్, లింగరావు, కల్లెడ శంకర్, అధికారులు ఎంపీడీఓ శంకర్, ఏఓ యోగిత, ఏపీఎం నరహరి, ఎంపీఓ రాజశేఖర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News