Former Minister Koppula Iswar : ఇదెక్కడి ఇందిరమ్మ రాజ్యం

దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి కొప్పుల తీవ్రంగా ఖండిచారు.

Update: 2024-08-06 12:32 GMT

దిశ, వెల్గటూర్ : దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి  కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండిచారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. దళిత మహిళ పట్ల రాక్షసంగా వ్యవహరించిన పోలీసులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైనదని పేర్కొన్నారు. నేరం ఒప్పుకోవాలంటూ మహిళా అని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..? ఇదెక్కడి ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. క్రమశిక్షణ నేర్పే పోలీసులే దారి తప్పుతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ చోద్యం చూస్తుందా అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత మహిళలకు ఏ పాటి గౌరవం ఉందో ఈ సంఘటన ద్వారా రుజువు అవుతుందన్నారు.

    దళిత మహిళపై దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా బాధిత మహిళకు న్యాయం చేయాలని కోరారు. దళితుల, మహిళల వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఆడబిడ్డలయిన ఎమ్మెల్యేలను అవమానిస్తుంటే తామేమీ వారికి తీసిపోమని

    షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాక్షసానందాన్ని పొందారన్నారు. లంచాలకు మరిగిన పోలీసు వ్యవస్థ దాష్టీకాలకు ఉదాహరణే ఇదన్నారు. రికవరీ సొమ్ము కోసం ఆశపడి ఫిర్యాదు దారుడితో కుమ్మక్కయి మహిళను చిత్రహింసలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు ఎంతో కాలం ఉండవని అన్నారు. ఆడ బిడ్డలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా పోలీసు శాఖ పని తీరుపై సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. 

Tags:    

Similar News