బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే.. పట్టణాల అభివృద్ధి: మంత్రి గంగుల కమలాకర్
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పట్టణాల అభివృద్ధి ఊపందుకుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన పీవీ నరసింహారావు పార్క్ ను మంత్రి ప్రారంభించారు.
దిశ, కరీంనగర్: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పట్టణాల అభివృద్ధి ఊపందుకుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన పీవీ నరసింహారావు పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో సరైన రోడ్లు లేక, వర్షాకాలంలో బుడదమయంగా ఉండేదని తెలిపారు.
దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని అన్నారు. తెలంగాణ రాక ముందు ప్రజలు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. రాష్ట్రం సాధించాక పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. అనంతరం మంత్రి ఎన్టీఆర్ చౌక్ వద్ద స్మార్ట్ సిటీ పనులను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్మార్ట్ సిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
పనుల్లో వేగం పెంచాలని అధికారులను, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కాంట్రాక్టర్లకు మంత్రి గంగుల సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ స్వరూప రాణి హరి శంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్డీవో ఆనంద్ కుమార్, కార్పొరేటర్ కోల మాలతి, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.