నిరుద్యోగ యువకులారా.. బీఆర్‌ఎస్‌ను ఓడించి గుణపాఠం చెప్పాలి :Bandi Sanjay Kumar

ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ లోని 57, 68, 59, 60 డివిజన్లలో బండి సంజయ్

Update: 2023-11-21 16:05 GMT

దిశ,కరీంనగర్ : ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ లోని 57, 68, 59, 60 డివిజన్లలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ మాట్లాడుతూ "కేటీఆర్ కండకావరం తలకెక్కింది.. నిరుద్యోగులు ఉద్యోగాలెందుకివ్వడం లేదని నిరసన తెలిపితే తప్పు చేశానని చెంపలేసుకోవాల్సిన కేటీఆర్ చెత్త నా కొడుకుల్లారా సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడుతున్నాడు.. ఆయనకు అహంకారం ఎక్కువైంది.. తెలంగాణ యువకులారా బీఆర్ఎస్ కు ఓడించి గుణపాఠం చెప్పి యువకుల సత్తా చాటండి" అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

ప్రచారంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు ఆయనకు పూలు చల్లి, తిలకం దిద్ది సంజయ్ నీరాజనం పట్టారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం పాత డీఐజీ బిల్డింగ్ సమీపంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేమో వంద గదుల ప్రగతి భవన్ కావాలే.. నిలువ నీడలేని పేదలకు మాత్రం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటికొక ఉద్యోగమైనా ఎందుకివ్వలే? కనీసం నిరుద్యోగ భృతి ఇస్తానని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. గంగుల కమలాకర్ మాటలను చూస్తే తనకు నవ్వొస్తుందని, కమలాకర్ కేఏ పాల్ తమ్ముడిలా జోకర్ లెక్క మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లను మట్టికలిపించి, బీజేపీకి ఘన విజయాన్నందించాలని సంజయ్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News