విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రెండు గేదెలు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2024-06-22 06:23 GMT

దిశ, మల్లాపూర్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రెండు గేదెలు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్ వాడ పరిధిలో గల గేదెల మంద లోకి రోజూలాగే రొడ్డ నర్సయ్య, వేములవాడ చంద్రయ్యలు తమ గేదెలను పంపించారు. మందలో విద్యుత్ వైర్లు నేలపైనే ఉండడంతో ఆ గేదెలకి షాక్ తగిలి మృతి చెందాయి. అయితే విద్యుత్ అధికారులు రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అక్కడ విద్యుత్ స్తంభం విరగడంతో వైర్లను తొలగించి నిర్లక్ష్యంగా అలాగే నేలపై వదిలేశారు. శనివారం ఉదయం గేదెలకి షాక్ తగిలి రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.

మృతి చెందిన గేదెలతో సబ్ స్టేషన్ ఎదురుగా బాధితులు ధర్నాకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి తమ గేదలు బలయ్యాయని వెంటనే లైన్ మెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.బాధితులు లైన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఏ ఈ వినీత్ కు వినతి పత్రం అందజేశారు.ఈ విషయమై మల్లాపూర్ విద్యుత్ ఏఈ వినీత్ వివరణ కోరగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లైవ్ లైన్ విద్యుత్ స్తంభం విరిగి ఐడియల్ గా ఉన్న వైర్లపై పడడంతో గేదెలు విద్యుత్ షాక్ కు గురయ్యాయని తెలిపారు. లైన్ మెన్ గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించాడని బాధితులు తెలుపగా విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అన్నారు.


Similar News