Postal Insurance : తపాలా బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తు ఆహ్వానం..

పెద్దపల్లి డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీస్ ల్లో తపాలా బీమా ( Postal Insurance )ఏజెంట్లను కమిషన్ బేసిగ్గా నియామకం చేస్తున్నట్లు తపాలా బీమా పెద్దపల్లి డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-10-26 06:19 GMT
Postal Insurance : తపాలా బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తు ఆహ్వానం..
  • whatsapp icon

దిశ, హుజురాబాద్ రూరల్ : పెద్దపల్లి డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీస్ ల్లో తపాలా బీమా ( Postal Insurance )ఏజెంట్లను కమిషన్ బేసిగ్గా నియామకం చేస్తున్నట్లు తపాలా బీమా పెద్దపల్లి డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి డివిజన్ పరిధిలోని వారు పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 50 సంవత్సరాలలోపు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు.

ఆసక్తి గలవారు వచ్చే నెల నాలుగో తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని, ఎంపిక చేసిన అభ్యర్థులు 11వ తేదీన హుజురాబాద్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు 5 వేల ఫిక్స్ డిపాజిట్ ( Fixed Deposit ) అందించాలని, మరిన్ని వివరాలకు హుజురాబాద్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News