తెగిన తాత్కాలిక రహదారి.. నిలిచిన రాకపోకలు
శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్ నుంచి
దిశ,వీణవంక: శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్ నుంచి జమ్మికుంట కు వెళ్తున్న ప్రధాన రహదారి గుండా రాకపోకలు నిలిచిపోయాయి.వివరాల్లోకి వెళితే మండలంలోని మామిడాల పల్లి గ్రామ శివారులోని కల్వర్టు ను నూతనంగా నిర్మిస్తున్నందున ప్రక్కన తాత్కాలిక రొడ్డును వేశారు.భారీ వర్షాలకు తాత్కాలిక రోడ్డు సోమవారం ఉదయం తెగిపోయింది.దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.దీంతో గ్రామస్తులు మరియు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కల్వర్టు పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.