Voter list :డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల

జిల్లాలో 4 లక్షల 75 వేల 64 మంది ఓటర్ల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా (Draft Voter List)విడుదల చేసినట్టు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ మంగళవారం తెలిపారు.

Update: 2024-10-29 13:01 GMT
Voter list :డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల
  • whatsapp icon

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో 4 లక్షల 75 వేల 64 మంది ఓటర్ల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా (Draft Voter List)విడుదల చేసినట్టు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ మంగళవారం తెలిపారు. జిల్లా పరిధిలో గల సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేశామని, వేములవాడ నియోజకవర్గం (Vemulawada Constituency)లో మొత్తం 2,27,575 మంది ఓటర్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో 2, 47,489 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

    జిల్లాలో మొత్తం 2,28,745 మంది పురుషులు, 2,46,114 మంది స్త్రీలు, 37 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. మరో 161 మంది పురుషులు, ఏడుగురు మహిళలు సర్వీస్ ఓటర్లుగా ఉన్నారన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రజలు తమ పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో చెక్ చేసుకోవాలని, లేని పక్షంలో నవంబర్ 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నవంబర్ 9,10 తేదీలలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రత్యేక క్యాంపులను సైతం ఏర్పాటు చేస్తామని, వీటిని వినియోగించుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. 

Tags:    

Similar News